పరిచయం

ఈ పత్రంలో కింది విషయాలు ఉన్నాయి:

  • సంస్థాపన-సంబంధిత నివేదిక

  • కెర్నలు నివేదిక

  • డ్రైవర్ నవీకరణ పరిక్రమం

  • కెర్నలు-సంబంధించిన నివేదిక

  • కెర్నలు నివేదిక

  • సాంకేతికత పరిదృశ్యం

  • పరిష్కరించిన విషయాలు

  • తెలిసిన విషయాలు

కొన్ని నవీకరణలుRed Hat Enterprise Linux 5.1 ఈ విడుదల నివేదిక కనిపించక పోవచ్చు. విడుదల నివేదిక యొక్క నవీకరణ ప్రతి ఈ కింది URLలో అందుబాటులో ఉంది:

http://www.redhat.com/docs/manuals/enterprise/RHEL-5-manual/index.html

సంస్థాపన-సంబంధ నివేదిక

ఈ కింది విభాగం ప్రత్యేకించిAnacondaసంస్థాపనకు సంబంధించిన సమాచారాన్ని; మరియూ వేరొక డ సంస్థా Red Hat Enterprise Linux 5.1. కలిగి ఉంది.

ఇప్పటికే సంస్థాపించబడ్డ Red Hat Enterprise Linux 5, ని నవీకరించటానికి, మీరు తప్పక మారిన పాకేజీలను పొందటానికి Red Hat Network ని తప్పక ఉపయోగించాలి.

మీరు Red Hat Enterprise Linux 5.1 యొక్క కొత్త సంస్థాపనను చేయటానికి లేదా కొత్తగా నవీకరించిన ప్రతి Red Hat Enterprise Linux 4కి Red Hat Enterprise Linux 5 నుండీ నవీకరణలను తీసుకోవటాని Anaconda ఉపయోగించవచ్చు.

  • ఒక వేళ మీరు Red Hat Enterprise Linux 5 CD-ROMల (నెట్వర్కు-ఆధారిత సంస్థాపనలో, ఉదాహరణకు) విషయాలను కాపీచేస్తుంటే CD-ROMలను ఆపరేటింగు విధానం కోసం మాత్రమే కాపీ చేయండి. ప్రత్యామ్నాయ CD-ROMని కాని,ఏ ఇతర లేయర్డ ఆధారిత సిడి-రామ్సు ను గాని కాపి చేయకండి,అది Anaconda సరియైన ఉపయోగాన్ని నిరోదిస్తుంది.

    Red Hat Enterprise Linux 5.1 సంస్థాపన జరిగిన తరువాత మాత్రమే ప్రత్యామ్నాయ CD-ROM మరియు వేరే లేయర్డు ఆధారిత CD-ROMs ను సంస్థాపంచవలెను.

  • Red Hat Enterprise Linux 5.1 వీటిని పూర్తిగా వాస్తవీకరించిన అథిదెయ పై సంస్థాపించునపుడు kernel-xenకెర్నల్ ను వాడవద్దు.ఈ కెర్నల్ ను పూర్తిగా వాస్థవీకరించిన అతిధేయ లో ఉపయోగించడం వలన సిస్టమ్ హేంగ్ కావచ్చు.

    పూర్తిగా వాస్తవీకరిం అథిదేయలో Red Hat Enterprise Linux 5 .1సంస్థాపనా సంఖ్యతో సంస్థాపించేటట్లైతే virtualization ప్యాకేజీ సమూహం ఎన్నిక చేయకండి.Virtualization ప్యాకేజీ సమూహం kernel-xen కెర్నల్ ను సంస్థాపించును.

    పరాన్నవాస్థవీకరణ అథిదేయులు ఈ విషయం ద్వారా ప్రభావితం కాదు. పరాన్నవాస్థవీకరణ అథిదేయులు ఎల్లప్పుడు kernel-xen కెర్నల్ ను వాడతారు.

  • మీరు వాస్థవీకరణ కెర్నల్ ఉపయౌగించి Red Hat Enterprise Linux 5 ని 5.1 గా నవీనీకరణ చేయుటకు రీబూట్ చేయవలెను.

    Red Hat Enterprise Linux 5 మరియు 5.1 యొక్క హైపర్విజర్సు ABI-సారూప్యతవి కావు.నవీకరణల మద్యలో రీబూట్ జరపనిచో నవీకరించిన వాస్థవిక RPM నడుస్తున్న కెర్నల్ తొ ఏకీభవించదు.

iSCSI సాఫ్టువేరు ప్రారంభం కోసం (బహిర్గత-iscsi) సంస్థాపన / బూట్

iSCSI సంస్థాపన మరియు బూట్ Red Hat Enterprise Linux 5 నందు సాంకేతిక పారిదృశ్యంగా పరిచయం చేయబడినది. క్రింద విశదీకరించిన పరిమితులకు లోబడి ఈ లక్షణం పూర్తిగా దోహదపడుతుంది

దీని యొక్క మూడు సామర్ధ్యపు ఆకృతీకరణలు వీటిమీద ఆధారపడి ఉంటుంది:

  • హార్డువేర్ iSCSI ప్రారంబిక(అదిQLogic qla4xxx) ను ఉపయోగిస్తుంది.

  • open-iscsi ప్రారంబికని iSCSI(అది iSCSI బూట్ ఫర్మువేర్ లేదా iSCSI బూట్ సామర్ధ్యంను స్వభావించు ఓపెన్ ఫర్మువేర్ విడుదల) ఫర్మువేర్ బూట్ మద్దతు కొరకు సిస్టమ్ లొ ఉపయోగించండి.

  • open-iscsi ప్రారంబికని iSCSI కొరకు ఫర్మువేర్ బూట్ మద్దతు లేకుండా ఉపయోగించండి.

హార్డువేర్ iSCSI ప్రారంబికని ఉపయోగించు.

మీరు iSCSI హార్డువేర్ ప్రారంబికని ఉపయోగించినట్లైతే , రిమోట్ నిల్వ అందుబాటును పొందటానికి అవసరమైన IP చిరునామా మరియు ఇత్రత్రా పారామీటర్సు కార్డు యొక్క BIOS సంస్థాపన ద్వారా ప్రవేశపెట్టుట వలన పొందవచ్చు.అదనపు సంస్థాపన అవసరం లేకుండానే రిమోట్ నిల్వ యొక్క ఉపభాగాలు Anaconda వద్ద ప్రమాణ sd సాధనాలుగా అందుబాటలో ఉంటాయి.

మీకు రిమోట్ నిల్వ సర్వర్ ఆక్రుతీకరణను అనుసరించి ప్రారంభిక అర్హత పేరు(IQN) నిర్ధారించుకోవలిసి వస్తే, సంస్థాపనలో ఈ వరుస క్రమమును అనుసరించండి.

  1. సంస్థాపనలో ఏ డిస్కు డ్రైవర్సు ఉపయోగించాలో ఎంచుకొనుటకు సంస్థాపనా ప్రతికి వెళ్ళండి.

  2. ఆధునిక నిల్వ ఆకృతీకరణకు ని నొక్కండి.

  3. Add iSCSI target.ని నొక్కండి.

  4. iSCSI IQN తెరపై ప్రదర్శితమవుతుంది.

iSCSI కొరకు ఫర్మువేర్ బూట్ మద్దతుతో సిస్టమ్ లోopen-iscsi ఉపయోగించు.

open-iscsi సాఫ్టు వేర్ ప్రారంబికని iSCSI కొరకు సిస్టమ్ లో ఫర్మువేర్ బూట్ మద్దతుతో ఉపయోగించేటట్లైతే, రిమోట్ నిల్వ పొందటానికి అవసరమైన IP చిరునామా మరియు ఇత్రత్రా పారామీటర్సు ప్రవేశానికి ఫర్మువేర్ యొక్క సెటప్ యుటిలిటిని ఉపయోగించు.ఇది చేయటానికి సిస్టమ్ ను రిమోట్ iSCSI నిల్వ బూట్ ఆకృతికి మార్చండి.

ప్రస్తుతం అనకొండ ఫర్మువేర్ ఇచ్చిన iSCSI సమాచారంను ఉపయోగించుటలేదు.బదులుగా సంస్థాపనయందు మానవీయంగా టార్గెట్ IP చిరునామాను ప్రవేశపెట్టుము.అది చేయుటకు పైన చెప్పినట్లు ప్రారంబిక యొక్క IQN ని నిర్ధారించుము.తరువాత మీరు సంస్థాపించదలచిన టార్గెట్ IP చిరునామాను అదే ప్రతిలో ప్రదర్శించబడిన IQN ప్రారంబిక వద్ద తెలుపండి.

మానవీయంగా iSCSI టార్గెట్ యొక్క IP చిరునామాను తెలిపిన తరువాత,iSCSI టార్గెట్ నందుగల తార్కిక భాగాలు సంస్థాపనకు అందుబాటులో ఉంటాయి.Anacondaద్వారా సృష్టించబడినinitrd ఇప్పుడు iSCSI టార్గెట్ యొక్క IQN మరియు IP చిరునామాను కలిగి ఉంటుంది.

iSCSI టార్గెట్ యొక్క IQN లేదా IP చిరునామాలను భవిష్యత్తులో మార్చేటట్లైతే,iBFT లేదా ప్రతి ప్రారంబిక యొక్క ఫర్మువేర్ సెటప్ యుటిలిటి తెరచి సంభందించిన పారామీటర్సు మార్చి ప్రవేశపెట్టుము.తరువాత ప్రతి ప్రారంబికననుసరించి initrd (iSCSI నిల్వలో ఉన్న) మార్చుము.

  1. initrd ను gunzip.ఉపయోగించి విశదీకరించు.

  2. cpio-i ఆదేశాన్ని ఉపయోగించండి.

  3. init లో iscsistartup అను పదము గల వాక్యం కొరకు వెదుకు.ఈ వాక్యం iSCSI యొక్క IQN మరియు IP చిరునామా ను కలిగి ఉంటుంది.క్రొత్త IQN మరియు IP చిరునామా లతో దానిని నవీకరించు.

  4. cpio -oఆదేశాన్ని ఉపయోగించి initrd ఎన్క్రిప్టు విలువని సృష్టించు.

  5. initrd ని gunzip ఉపయోగించి మరల కుదించుము.

బాహ్య Firmware ఇచ్చే iSCSI సమాచారం ఆపరేటింగ్ విధానం పొందటానికి /iBFT firmware భవిష్య విడుదలలో ప్రణాలిక చేయుచున్నది. ఈ వృద్తి iSCSI టార్గట్ యొక్క IP చిరునామా లేదా IQN initrd(iSCSI నిల్వలో ఉన్న) ప్రతి ప్రారంబికకు మార్చే అవసరాన్ని తోలగిస్తుంది.

open-iscsi ని సిస్టమ్ లో iSCSI కొరకు ఫర్మువేర్ బూట్ మద్దతు లేకుండా ఉపయోగించండి.

మీరు open-iscsi సాఫ్టువేర్ ప్రారంబికని సిస్టమ్ లో iSCSI ఫర్మవేర్ బూట్ మద్దతు లేకుండా ఉపయోగించేటట్లైతే,నెట్వర్కు బూట్ సామర్ధ్యం(అవి PXE/tftp) ఉపయోగించండి.ఈ సందర్భంలో ప్రారంబిక IQN మరియు iSCSI టార్గెట్ IP చిరునామా నిర్ణయించుటకు ముందుగా విసదీకరించిన విధానాన్ని అమలుచేయండి. అయిన తరువాతinitrd ను నెట్వర్కు బూట్ సర్వర్ లో ఉంచి,సిస్టమ్ ను నెట్వర్కు బూట్ లో ఉంచండి.

అదేవిధంగా,iSCSI టార్గట్ యొక్క్క IQN లేదా IP చిరునా మారితే,initrd తప్పక మార్చవలెను. అది చేయుటకు initrd ప్రతి ప్రారంబికకు మార్చుటకు ముందుగా విసదీకరించిన విదానాన్ని ఉపయోగించండి.

భవిష్య-నవీకరణలు

EXT3 కోసం వృద్ధి

EXT3 యొక్క గరిష్ఠ పరిమితి ఇప్పుడు 16TB(8TB నుండి పెరిగింది).ఈ వృద్ది ప్రాధమికంగా సాంకేతిక పారిదృశ్యంగా Red Hat Enterprise Linux 5 దీనిలో చేర్చబడినది,ఈ విడుదలలో పూర్తిగా మద్దతు నిస్తోంది.

yum-security

ఇప్పుడు yum ను రక్షణ పురోగమ సంస్థాపనకుమాత్రమే నియంత్రించ వచ్చును.అది చేయుటకుyum-security ని సంస్థాపించి,ఈ క్రింది ఆదేశాన్ని నడుపుము.

yum update --security

అనకొండ లేయర్ 2 రీతి యొక్క వృద్ది.
వనరుని స్వతంత్రంగా పునహ్ ప్రారంభించు.

క్లస్టర్ యొక్క ప్రాధమిక సేవకు భంగం కలిగించకుండానే వనరును పునహ్ ప్రారంభించ వచ్చు.వనరులని స్వతంత్రంగా వుంచటావికి __independent_subtree="1" ని ఉపయోగించి,నడుస్తున్న ఉపయుక్త లో /etc/cluster/cluster.conf ని ఆకృతీకరించవలెను.

ఉదాహరణకుసం:

<service name="example">
        <fs name="One" __independent_subtree="1" ...>
                <nfsexport ...>
                        <nfsclient .../>
                </nfsexport>
        </fs>
        <fs name="Two" ...>
                <nfsexport ...>
                        <nfsclient .../>
                </nfsexport>
                <script name="Database" .../>
        </fs>
        <ip/>
</service>

ఇక్కడ రెండు దస్త్ర పద్దతి వనరులు ఉన్నాయి.One and Two. Oneవిఫలమైతే Twoకి భంగం వాటిల్లకుండా పునహ్ ప్రారంబించ బడుతుంది.Twoవిఫలమైతే అన్ని మూలకాలు(One,One యొక్క చిల్డ్రన్ మరియు Two యొక్క చిల్డ్రన్)పునహ్ ప్రారంబించ బడతాయి.One తో సమకూరే ఏ వనరుపైనైనా ఆధారపడి ఉన్న Two మరియు చిల్డ్రన్ కూడా.

Samba స్వతంత్ర ఉపశాఖలతో కూడిన సేవలో ఉపయోగపడదు గనుక దానికి నిర్దిష్ఠమైన సేవారూపం అవసరం.ఇది చాలా సేవలలో వాస్తవం.అందుకని __independent_subtree="1" ని గమనిక తో వాడండి.

వాస్తవీకరణ

కింది గుణకాలు కూడా దీనిలొ చేర్చబడ్డాయిలేదు:

  • ఈ వాస్తవీకరించబడిన కెర్నలు kdump క్రియాశీలతను ఉపయోగించగలదు.

  • AMD-V ఈ విడుదలలో మద్దతునిస్తుంది.ఇది పూర్తిగా వాస్తవీకరించబడిన అతిధేయాలకు లైవ్ డోమైన్ మైగ్రేషన్ ను ఇస్తుంది.

  • వాస్తవిక కెర్నల్ ఇప్పుడు 256GB RAM దాకా మద్దతునిస్తుంది.

  • in-kernel socket API ఇప్పుడు విస్తరించబడినది.అతిధేయాల మద్య sctp నడుపుతున్నప్పుడు వచ్చే బగ్ గుర్తించడానికి ఇది చేయబడినది.

  • వాస్తవిక నెట్వర్కింగ్ ఇప్పడు వాస్తవిక లైబ్రరి లోని libvirt యెక్క భాగం.libvirt మిషన్ లోని స్థానిక అతిధేయాల కొరకు వాస్తవ NAT/router మరియు వ్యక్తిగత వలయం సమకూర్చుటకు ఆదేశాల సమూహాన్ని కలిగి ఉంది.ఇది ప్రత్యేకంగా బయటనుండి రాని అతిధేయాలకు ఉపయోగం.వాస్తవికతను ల్యాప్ టాప్ నందు ఉపయోగించే వారికి కూడా ఉపయోగం.

    వాస్తవిక నెట్వర్కింగ్ సామర్ధ్యం,dnsmasq ఏదైతే dhcpని వాస్తవిక నెట్వర్కు కొరకు కలిగి ఉందో ,దాని పై ఆధారపడునట్లు చేస్తుంది.ని

    libvirtప్రతి నవీకరణాకు, దయచేసి http://people.redhat.com/dledford/Infiniband/openmpiను శోధించండి

  • libvirt ఇప్పుడు అచేతన వాస్తనిక మిషన్సుని నిర్వహించగలదు. libvirt దీనిని డొమైన్లను ప్రారంబించడం లేదా ఆపివేయడం చేయకుండానే నిర్వచన మరియు అనిర్వచన ద్వారా చేయగలదు. ఈ క్రియాశీలత virsh define మరియు virsh undefine ఆదేశాలకు ఐచ్చికం.

    ఈ వృద్ది ద్వారా Red Hat వాస్తవిక మిషన్ నిర్వహణను అందుబాటులో ఉన్న అన్ని అతిధేయాలను ప్రదర్శింప గలుగుతుంది. ఇది మిమ్ముల్ని సూటిగా GUI ఈ అతిధేయాలను ప్రారంభింపనిస్తుంది.

  • ఉదాహరణకు, kernel-xen ప్యాకేజీ సంస్థాపన తరువాత, elilo.conf కింది విధంగా చదవబడుతుంది:

  • పూర్తిగా వాస్తవీకరించబడ్డ ఆతిధేయాలు భద్రపరచబడవు, తిరిగి నిలవఛేయబడ్డవి లేదా వలసవెళ్లినవి.

  • xm create ఆదేశం వాస్తవిక కంప్యూటరు మేనేజరులోని చిత్రసంబంధ virt-managerలను కలిగిఉంది.

  • Nested Paging (NP) ఇప్పుడు మద్దతునిస్తుంది.ఈ లక్షణం వాస్తవిక పరిసరాలలో మెమొరీ నిర్వహణా కష్టాన్ని తగ్గిస్తుంది.అదనంగా NP, CPU ఉపయోగాన్ని మెమొరీ-ఇటెన్సివ్ అతిధేయాల లో తగ్గిస్తుంది.

    ప్రస్తుతం NP ప్రాధమికంగా ఉపయోగంలోకి రాదు.మీ సిస్టమ్ NP కి మద్దతునిచ్చున దైతేhap=1 పారామీటర్ తో హైపర్వజర్ బూటింగుతో NP సిద్దం చేయుట మంచిది.

వాస్తవీకరణకు సంభందించిన ఈ నవీనీకరణలో 64-bit ఆతిధ్యంలో పారావర్చ్యులైజ్జు 32-bit అతిధేయాలను సంస్థాపించుటకు మరియు నడుపుటకు సామర్ద్యం కలదు.ఏమైనప్పటికి ఈ సామర్ద్యం సాంకేతిక పారిదృశ్యంగానే ఉన్నది,ఉత్పాదకంగా మద్దతు నివ్వడం లేదు.

భాగస్వామ్య ప్రతి పట్టీలు.

భాగస్వామ్య ప్రతి పట్టీలుఇప్పుడుhugetlb మెమొరీ కి మద్దతు నిస్తున్నది. ఇది ప్రతి పట్టీల వివరాలను వేర్వేరు విధానాల మధ్య పంచుకోవటానికి సాద్యపడుతుంది.

ప్రతి పట్టీ వివరాలను వేర్వేరు విధానాల మద్య పంచుకోవడం వలన క్యాషీ స్థలం తక్కువ ఖర్చవుతుంది.ఇది అనువర్తనాలు క్యాషీని తాకు నిష్పత్తి పెరిగి,అనువర్తనం యొక్క కార్యదక్షత పెరుగుతుంది.

tick_divider

tick_divider=<value> అనునది sysfs యొక్క పారామీటర్,ఇది వినియోగదారుని వద్ద అనువర్తనం లో ఐచ్చిక HZ సమయ విలువను పాటిస్తున్నప్పుడు సిస్టమ్ సమయాన్ని సరిదిద్దుటకు ఉపయోగపడుతుంది.

tick_divider=ఎంపిక సమయవిదానాలను మరియు సమీకరణాల నిర్దిష్టాన్ని తగ్గించడం ద్వారా CPU భారాన్ని తగ్గించి పనితనాన్న పెంచుతుంది.

<values>

  • 2 = 500Hz

  • 4 = 250Hz

  • 5 = 200Hz

  • 8 = 125Hz

  • 10 = 100Hz (Red Hat Enterprise Linuxయొక్క గతవిడుదల విలువనుపయోగించి)

వాస్థవిక కెర్నల్ బహుళ సమయ పాలనను అతిధేయాలలో మద్దతునివ్వదు.బహుళ టిక్ పాలనకు కారణమగు భారాన్ని dom0 నిర్దిష్ఠ సమయపాలనను అతిధేయాలలో ఉపయోగించి తగ్గిస్తున్నది.

dm-బహుళ మార్గం సాధనాలకు సంస్థాపిస్తోంది

Anacondaండ ఇప్పుడు నియంత్రణ, సృష్టించటం, మరియూdm-multipath సాధనాలకు సంస్థాపించటం మొదలైన సామర్ధ్యాలను కలిగి ఉంది. ఈ లక్షణాలను సాధ్యం చేయటానికి, mpath పారామితిని కెర్నల్ బూట్ పంక్తికి కలపండి.

ఈ లక్షణం ప్రధమంగా Red Hat Enterprise Linux 5 లో సాంకేతిక పరిదృశ్యంగా పరిచయంచేయబడింది, మరియు ఇప్పుడు పూర్తిగా మద్దతునిస్తోంది.

dm-multipath,Dell MD3000కొరకు ఇన్ బాక్సు సపోర్టు నిస్తోంది. ఏమైనప్పటికి MD3000 పొందటానికి dm-multipath ని ఉపయోగించే బహుళ నోడ్లు తత్వర ఫెయిల్ బాక్ చేయలేక పోతున్నాయి.

ఇంకా మీ సిస్టమ్ బహుళమార్గం మరియు బహుళమార్గంకాని పరికరాలను కలిగి ఉంటే ఇచ్చా విభజన అంతర్ముఖనం Anaconda లో మంచిది.స్వయంచాలక విభజన చేసినట్లైతే ఆసందర్భంలో ఐచ్చిక తార్కిక పరిమాణ సమూహం లోనే ద్వంద విధాన పరికరాలను ఏర్పరుస్తుంది.

ప్రస్తుతం ఈ నియమాలు ఈ లక్షణం కు వర్తిస్తాయి.

  • ఒకే ఒక మార్గం బూట్ Logical Unit Number (LUN) కి ఉంట్,Anaconda mpath ను తెలిపినా కూడా SCSI పరికరాన్ని సంస్థాపిస్తుంది.మీరు LUN కోరకు బహళ మార్గాలను సిద్దపరిచినాకూడా మరియు initrd సృష్టించిన,OS dm-multipath నుండి కాకుండా SCSI నుండి బూట్ అవుతుంది.

    LUN బూట్ కావటానికి బహుళమార్గాలు ఉన్నప్పటికి,కెర్నల్ బూట్ వరుసలోmpath తెలిపిన తరువాత dm-multipath పరికరానికి Anaconda ఖచ్చితంగా సంస్థాపించబడుతుంది.

  • వినిమయకారుని_సహాయక_నామాలు సరే గా multipath.conf లో సరిచేయబడతాయి. dm-multipath మూల పరికరం యొక్క మద్దతు పెంచటానికి ఇది అవసర సర్దుబాటు.వినిమయకారుని_సహాయక_నామాలు వద్దుకు మరియుinitrd ని తిరిగి సృష్ఠిస్తే, క్రింది కారణాలతో బూట్ వైఫల్యం సంభవిస్తుంది:

    ఫైల్ సిస్టమ్ ను పరీక్షిస్తుంది
    fsck.ext3: తెరుచుటకు ప్రయత్నించునపుడు అటువంటి దస్త్రము లేదా డైరెక్టరీ లేదు/dev/mapper/mpath0p1
    
నిల్వ ప్రదేశ వలయం(SAN) నుండి బూటింగ్.

SAN డిస్కు పరికరం నుండి బూట్ మద్దతు నిస్తుంది.ఈ సందర్భంలో SAN ఫైబర్ చానల్ లేక iSCSI అంతర్ముఖిని చూస్తుంది. ఈ సామర్ద్యం dm-multipath ని వాడి బహుళ మార్గల ద్వారా సిస్టమ్-నుండి-నిల్వ అనుసంధానిస్తుంది.

ఆకృతీకరణలలో బహుళ అతిధేయి బస్ ఎడాప్టర్సు(HBA) ని ఉపయోగిస్తుంది,ప్రస్తుత ఎడాప్టర్ నుండి వచ్చు అన్ని మార్గాలు విఫలమైతే సిస్టమ్ BIOS ను వేరే మార్గంనుండి బూట్ అగునట్లు సర్దు చేయవలె.

nfsroot

nfsroot ఈ నవీనీకరణలోలలో పూర్తిమద్దతునిస్తుంది.

nfsrootయధార్ధంగాRed Hat Enterprise Linux 5 లో స్థితిలేని Linux యొక్క ఉపభాగ సాంకేతిక పరిదృశ్యంగా పరిచయంచేయబడింది.స్థితిలేని Linux పురోభివృద్ది సాంకేతిక పరిదృశ్యంగానే మిగిలి ఉంది

ప్రస్తుతం nfsroot ఈ క్రింది నియంత్రణలను కలిగి ఉంది:

  • ప్రతి కక్ష్యిదారి NFS సర్వర్ లో ప్రత్యేక రూట్ ఫైల్ సిస్టమ్ తప్పక కలిగి ఉంటుంది. రీడ్-ఓన్లీ రూట్ ఉపయోగంలో ఉన్నప్పుడే ఈ నియంత్రణ వర్తిస్తుంది.

  • NFS లో SWAP మద్దతునివ్వదు.

  • nfsroot కక్షిదారులలో SELinux సిద్దంకాలేదు.సాదారణంగా Red Hat SELinux ని అచేతనం చేయడానికి మద్దతునివ్వదు.కనుక వినియోగదారులు ఈ చర్య యొక్క రక్షణా ఇంప్లికేషన్సు పరిగణించాలి.

nfsrootఅమర్చుటకు క్రింది విధానాన్ని చూడు.ఈ విధానం మీ వలయ పరికరం eth0 గాను మరియు వలయ డ్రైవర్ tg3 గాను భావిస్తుంది. మీ సిస్టమ్ ఆకృతిని అనుసరించి మీరు సర్దుబాటు చేయవలసి ఉంటుంది.

  1. initrd కింది ఆదేశాన్ని ఉపయోగించి సురక్షిత స్థానంనుండీ బాకప్ సృష్టించు:

    mkinitrd --with=tg3 --rootfs=nfs --net-dev=eth0 --rootdev=<nfs server ip>:/<path to nfsroot> ~/initrd-<kernel-version>.img <kernel-version>

    initrd తప్పక Red Hat Enterprise Linux 5.1 కెర్నల్ ఉపయోగించి సృష్ఠించ వలెను.

  2. ముందుగా ఉన్న initrd నుండి zImage.initrd చిత్రాన్ని సృష్ఠించు. zImage.initrd ఒక కుదించిన కెర్నల్ మరియు initrd లో ఒక చిత్రం.క్రింది ఆదేశాన్ని ఉపయోగించు:

    mkzimage /boot/System.map-<kernel-version> ~/initrd-<kernel-version>.img /usr/share/ppc64-utils/zImage.stub ~/zImage.initrd-<kernel-version>

  3. tftp సర్వర్ లో ఎగుమతిదాయకమైన స్థలములోకి.సృష్ఠించబడిన zImage.initrd-<kernel-version> ను ఉంచండి.

  4. nfsroot లోకి ఎగుమతి చేయబడిన ఫైల్ సిస్టమ్ nfsసర్వర్ లో తప్పనిసరైన బైనరీస్ మరియు గుణాంకాలు కలిగి ఉండునట్లు చేయి. ఈ బైనరీస్ మరియు గుణాంకాలు మొదటగా initrd ని సృష్ఠించటానికి వాడిన కెర్నల్ అయి ఉండాలి.

  5. కక్షిదారిని టార్గట్zImage.initrd-<kernel-version> కి DHCP సర్వర్ ద్వారా ఆకృతీకరించు.

    ఇది చేయుటకు DHCP సర్వర్ యొక్క /etc/dhcpd.conf దస్త్రానికి క్రింది ప్రవేశాలను కలుపు.

    next-server <tftp hostname/IP address>;
    filename "<tftp-path>/zImage.initrd";
    

    tftp ఎగుమతి డైరెక్టరీ లోని zImage.initrdకి <tftp-path> మార్గాన్ని తెలుపుతుందని గమనించాలి.ఉదాహరణకు zImage.initrdకి ఖచ్చితమైన మార్గం/tftpboot/mykernels/zImage.initrd మరియు /tftpboot/అది tftp ఎగుమతి డైరక్టరి అయితే, <tftp-path> తప్పక mykernels/zImage.initrd అవుతుంది.

  6. చివరిగా మీ సిస్టమ్ బూట్ ఆకృతీకరణ పారామితులను మొదట వలయ పరికరం నుండి (ఈ ఉదాహరణలో వలయ పరికరం eth0) బూట్ అగునట్లు చేయండి..

GFS2

GFS2 GFS యొక్క పెరుగుతున్న అభివృద్ది.ఆన్ డిస్కు ఫైల్ సిస్టమ్ పద్దతి మార్చుటకు అవసరమైన చాలా పురోభివృద్దిని ఈ నవీనీకరణ అందించింది.GFS ఫైల్ సిస్టమ్ ఇప్పుడు GFS2 గా gfs2_convert ఉపయోగించి మార్చవలె,ఏదైతే GFS ఫైల్ సిస్టమ్ మెటాడాటా ను నవీకరిస్తుంది.

GFS2 యదార్ధంగా Red Hat Enterprise Linux 5 లో సాంకేతిక పరిదృశ్యంగా విడుదలగాబడింది,మరి ఇప్పుటి నవీనీకరణ లో పూర్తగా మద్దతునిస్తోంది.బెంచిమార్కు పరీక్షలు ద్విగణీకృత పనితనాన్ని చూపుతున్నాయి వీటిపై:

  • ఒక డైరక్టరీ మరియు వేగవంతమైన డైరెక్టరీ గ్రాహ్యం ఎక్కువ వినిమయం(పోస్టుమార్కు బెంచ్ మార్కు)

  • synchronous I/O విధానాలవల్ల (fstest benchmark పరీక్షTIBCO వంటి సమాచార అనువర్తనాలకి అధిక పనితనాన్ని సూచిస్తోంది)

  • కాచెడ్ చదవబడింది,ఎటువంటి లాకింగ్ భారము లేదు

  • ముందుగాఅమర్చబడిన దస్త్రాలకి సూటి I/O

  • NFS దస్త్రం లుకప్సుని చూచుకోగలదు.

  • df,సమకూర్చబడిన సమాచారంగా ఇప్పుడు ఉంది.

అదనంగా, GFS2 లో వాస్తవీకణ; కింది లక్షణాలు:

  • పత్రికలు మెటడాటా బదులు ఇప్పుడు సాదా(అంటే దాచిన)దస్త్రాలు.ప్రత్రికలు ఇప్పుడు స్వయంచాలకంగా ఫైల్ సిస్టమ్ ను ఏర్పరిచే ఆధీకృత సర్వర్ కు కలుపబడుతున్నవి.

  • కోట్సు ఇప్పుడు మౌంట్ విధానంquota=<on|off|account> లో సిద్దం మరియు అసిద్దం చేయబడుతున్నవి.

  • quiesce పత్రికల వైఫల్య సమీకరణకు క్లస్టర్సు లో అవసరంలేదు.

  • నేనోసెకండ్ సమయముద్రలు ఇప్పుడు మద్దతునిస్తాయి.

  • ext3 కి సమానంగా, GFS2 ఇప్పుడు data=ordered రీతి కి మద్దతిస్తోంది.

  • ఇప్పుడు నిర్ధారితioctl() ద్వారా సర్దుబాట్లు lsattr() and chattr() మద్దతిస్తున్నాయి.

  • 6TB కన్నా ఎక్కువ ఉన్న ఫైల్ సిస్టమ్సు ఇప్పుడు మద్దతిస్తున్నాయి.

  • GFS2 నిర్ధారిత ఫైల్ సిస్టమ్,మరియు నాన్-క్లస్టర్డు ఆకృతీకరణ లో వాడవచ్చు.

డ్రైవరు నవీకరణ పరిక్రమం

డ్రైవర్ నవీనీకరణ పరిక్రమం(DUP) మూడో-పార్టీ వెండార్సు వారి స్వంత డ్రైవర్ పరికరాలు మరియు వేరే లైనెక్సు కెర్నల్ గుణకాలు Red Hat Enterprise Linux 5 కు కలుపుటకు నిర్మించబడింది.నిత్య RPM ప్యాకేజీలను సరఫరాచేయుటకు సిస్టమ్సు ఉపయోగించుకుంటాయి.

గమనించు విధంగా Red Hat Enterprise Linux 5.1చాలా నవీనీకరణలను DUP కి అమలు చేసింది.

  • డ్రైవర్ నవీనీకరణ డిస్కు ద్వారా సమయ-డ్రైవర్ నవీనీకరణ RPMs సంస్థాపన ఇప్పుడు మద్దతిస్తోంది.

  • బూట్ మార్గ నవీనీకరణలు సిస్టమ్ బూట్ మార్గం పై ప్రభావితం చూపుట ఇప్పుడు మద్దతునీయబడింది.

  • మూడో-పార్టీ ప్యాకేజీAdvanced Linux Sound Architecture(ALSA) కి మద్దతు డిప్రికేట్ చేయబడింది.

ఇంకా అనుమతించబడిన కెర్నల్ ABI గుర్తు తెలుపు జాబితాలకు వేర్వేరు నవీనీకరణలు అమలుచేయబడతాయి.మూడో-పార్టి డ్రైవర్ కెర్నల్ యొక్క ఏ గుర్తులను మరియు డాటా ఆకృతులను వాడాలో నిర్ధారించుటకు ప్యాకేజింగ్ డ్రైవర్సు ఈ తెలుపుజాబితాలను ఉపయోగించుకుంటాయి.

అధిక సమాచారం కొరకు http://www.kerneldrivers.org/RedHatKernelModulePackages. చూడండి.

డ్రైవరు నవీకరణాలు

సాధారణ డ్రైవర్ నవీనీకరణలు.
  • లెనోవో లాప్ టాప్ లలో చాలా ACPI మరయూ డాకింగ్ క్షేత్ర విషయాలను గుర్తించటానికి,acpi ibm-acpi గుణకాన్ని నవీకరించింది.

  • బేస్ బోర్డ నిర్వహణా నియంత్రికకు హార్డువేర్ బంధకం ఏర్పడితే ipmi: Polling kthread ఇక నడవదు.

  • sata: SATA/SAS 2.6.22-rc3 కి నవీకరించబడింది.

  • openib మరియు openmpi:OFED (OpenFabrics Enterprise Distribution) విడుదల 1.2. కి నవీకరించ బడ్డాయి.

  • powernow-k8: Greyhoundకి పూర్తిగా మద్దతు నివ్వడానికి విడుదల 2.0.0 కు నవీకరించబడింది.

  • పూర్తిగా RSA సపోర్టు కొరకు xinput కలుపబడింది.

  • ఎంబడెడ్ సీక్వెన్సర్ ఫర్మువేర్ ను v17 కి నవీకరించడంతోపాటు,aic94xx: విడుదల 1.0.2-1 కి నవీకరించబడింది.ఈ నవీనీకరణలు క్రింది మార్పులను అమలు పరుస్తాయి.

    • విస్తరణలతో ఫ్లాట్ఫాం పై ascb రేస్ కండీషన్.

    • added REQ_TASK_ABORT and DEVICE_RESET handlers

    • తప్పును గుర్తించిన తరువాత భౌతిక పోర్ట్సు సవిధంగా శుభ్రపరచబడతాయి.

    • phys ఇప్పుడు sysfs ద్వారా సిద్దం మరియు అసిద్దం చేయబడుతుంది.

    • DDB రేస్ కండీషన్ నియంత్రించుటకు DDB లాక్ ఉపయోగం పొడిగించబడింది.

ద్వని

ALSA నిడుదల 1.0.14 కి నవీకరించ బడింది.ఈ నవీకరణ క్రింది సవరణలను అమలుపరుస్తుంది.

  • IBM Taroko (M50) లో ధ్వని ఇబ్బందులను సరిచేస్తుంది.

  • Realtek ALC861 ఇప్పుడు మద్దతునిస్తుంది.

  • xw8600 and xw6600 లో మ్యూటింగ్ ఇబ్బంది సరిచేయబడింది.

  • ADI 1884 Audio ఇప్పుడు మద్దతునిస్తోంది.

  • xw4600 శబ్ద ఆకృతీకరణ ఇబ్బంది సరిచేయబడింది.

PCI
  • కలుపబడిన క్రియాశీలత గరిష్ట చదువు అభ్యర్ధనను PCIX and PCI-Express కొరకు ఉంచుతుంది.

  • IBM System P ఇప్పుడు PCI-Express హాట్ ప్లగింగ్ కు మద్దతునిస్తోంది.

  • SB600 SMBus కు మద్దతునివ్వటానికి అవసరమైన డ్రైవర్సు మరియు PCI ID కలుపబడినవి.

నెట్వర్కింగ్
  • I/OAT-సిద్దంచేయబడిన చిప్సెట్ మద్దతు ఇవ్వడానికి e1000 డ్రైవర్ విడుదల 7.3.20-k2 కు నవీకరించబడింది.

  • 5709 హార్డవేర్ కు మద్దతునివ్వడానికి bnx2 డ్రైవర్ విడుదల 1.5.11 కు నవీకరించబడింది.

  • క్రింది మార్పుల కొరకు B44 ఈదర్ నెట్ డ్రైవర్:అప్ స్టీమ్ విడుదల 2.6.22-rc4 కు బ్యాక్ పోర్టు చేయబడింది.

    • చాలా endianness సరికూర్పులు చేయబడ్డాయి.

    • DMA_30BIT_MASK స్థిరరాశి ఇప్పుడు వాడబడుతుంది.

    • skb_copy_from_linear_data_offset() ఇప్పుడు వాడబడుతుంది.

    • spin_lock_irqsave() ఇప్పుడు భద్రమైన నిరోధ అసిద్ద లక్షణాన్ని అందిస్తోంది.

    • స్థంబన అప్పుడు సరళ తప్పు పరిశీలన జరుపబడుతున్నది.

    • మల్టికాస్టు కు చాలా సరికూర్పులు అమలవుతున్నాయి.

    • గ్రతంలో కంటే చిప్ రీసెట్ ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటోంది.

  • ifup/ifdown ఆదేశాలు పునరావృతంగా అమలవుతున్నప్పుడు కెర్నల్ ఇబ్బందికి కారణమవుతున్న లోపం సరిచేయుటకు Marvell sky2 డ్రైవర్: విడుదల 1.14కి నవీకరించబడింది.

  • forcedeth-0.60 డ్రైవర్: ఈ విడుదలలో చేర్చబడింది. NVIDIA's MCP55 మదర్ బోర్డు మరియు సంభదిత ఆన్ బోర్డు NIC వాడుతున్న వినియోగదారుల కొరకు చాలా లోపాల యొక్క క్లిష్ట సరికూర్పులను అమలుపరుస్తోంది.

  • ixgb డ్రైవర్: సరిక్రొత్త అప్ స్ట్రీమ్ విడుదల (1.0.126) కు నవీకరించబడింది.

  • NetXen 10GbE వలయ కార్డుల కొరకు మద్దతు సిద్దపరచుటకు netxen_nic డ్రైవర్: విడుదల 3.4.2-2 ను జతపరిచినది.

  • Chelsio 10G ఈదర్నెట్ వలయ నియంత్రిక ఇప్పుడు మద్దతునిస్తోంది.

  • PCI తప్పు సమీకరణకు s2io పరికరానికి మద్దతు జతకలుపబడింది.

  • nx6325 కార్డు కొరకు PCI ID కు బ్రాడ్కామ్ వైర్లెస్ ఈదర్నెట్ డ్రైవర మద్దతునిస్తోంది.

  • ifup.ద్వారా BCM4306ని ప్రారంభింప ప్రయత్నించునపుడు ASSERTION FAILED తప్పుకు కారణం అయ్యే లోపం సరిదిద్ద బడింది.

  • ixgbడ్రైవర్: Intel 10-gigabit కార్డుకు EEH PCI తప్పు సమీకరణ మద్దతు నిచ్చునట్లు నవీకరించబడింది. అదిక సమాచారం కొరకు /usr/share/doc/kernel-doc-<kernel version>/Documentation/pci-error-recovery.txt ను చూడండి.

  • qla3xxx డ్రైవర్: ను iSCSI ఉపయోగించ కుండా QLogic iSCSI ఎడాప్టర్సుకి నెట్వర్కింగ్ మద్దతునివ్వడానికి సిద్దపరచి మరియు విడుదల 2.03.00-k3 కి నవీకరించారు.

  • Intel PRO/Wireless 3945ABG వలయ డ్రైవర్: విడుదల 1.2.0 కి నవీకరించబడింది.కొన్ని ల్యాప్ టాప్ లలో ఆయా పరిస్తితులలో వచ్చు సాఫ్టులుకప్ లోపం,తో కలిపి ఈ నవీనీకరణ చాలా విషయాలను ముగింపచేసింది.

  • qla2xxx:డ్రైవర్ విడుదల 8.01.07-k6 కి నవీకరించబడింది.ఇది చాలా మార్పులను గమనించదగునట్లు అమలుపరిచింది.

    • iIDMA ఇప్పుడు మద్దతుఇవ్వబడుతోంది.

    • క్రింది ఫైబర్ ఛానల్ యాట్రిబ్యూట్సు కు మద్దతు నీయబడింది.

      • సింబాలిక్ ఉపయుక్త పేరు.

      • సిస్టమ్ అతిధేయి పేరు.

      • ఫాబ్రిక్ పేరు.

      • అతిధేయి పోర్టు స్థితి.

    • గుర్తింపు-నియంత్రి async కార్యాలు లాగ్ చేయబడవు.

    • రీసెట్ హ్యాడ్లింగ్ తార్కిక సరిదిద్ద బడింది.

    • MSI-X మద్దతివ్వబడుతోంది.

    • సిస్టమ్ కి IRQ-0 కూర్పులు హ్యాండిల్ చేయబడుతున్నవి.

    • NVRAM నవీకరణలు అప్పటికప్పుడే అమలు కాబడుతున్నవి.

IPMI

ఈ విడుదల IPMI డ్రైవర్ సెట్ ను విడుదల 2.6.21.3 యొక్క అప్ స్ట్రీమ్ మార్పులు,2.6.22-rc-4 ప్యాచెస్ తో కలిపి ఉండునట్లు నవీకరించబడింది.ఈ నవీకరణ క్రింది మార్పులను(వాటితో కలిపి) ఇస్తోంది.

  • ipmi_si_intf లోని విలువఇవ్వని డాటా లోపాన్ని సరిదిద్దింది.

  • వేరే డ్రైవర్ మద్దతు బంధకం అవుతున్నప్పుడు kipmid ప్రారంభంకాలేదు.

  • force_kipmid ద్వారా కెర్నల్ డెమాన్ enable ను ఓవర్ రైడ్ చేయుటకు ఇప్పుడు వినియోగదారులు అనుమతింపబడ్డారు.

  • పర్-చానల్ ఆదేశం నమోదు ఇప్పుడు మద్దతిస్తోంది.

  • MAX_IPMI_INTERFACES ఉపయోగంలో లేదు.

  • హాట్ సిస్టమ్ అంతర్ముఖి తోలగింపు ఇప్పుడు మద్దతిస్తోంది.

  • ఫర్ము వేర్ నవీనీకరణ మద్దతుకు నిర్వహణా రీతి కలుపబడింది.

  • pigeonpoint IPMC మద్దతుకుpoweroff కలుపబడింది.

  • BT ఉపడ్రైవర్ ఇప్పుడు దీర్ఘ కాలవినిమయాన్ని కాపాడగలదు.

  • హాట్ తొలగింపులో సరైన శుబ్రతకు pci_remove కలుపబడింది.

క్రొత్త గుణక పారామితుల సమాచారం కొరకు /usr/share/doc/kernel-doc-<kernel version>/Documentation/IPMI.txt చూడండి.

SCSI
  • Red Hat Enterprise Linux 4 నుండి SCSI బ్లాక్ లిస్టు ఈ విడుదలకి పోర్టు చేయబడింది.

  • added PCI IDs for aic79xx driver.

  • PRIMERGY RX800S2 మరియు RX800S3 కు మద్దతు ఇవ్వటానికి aacraid డ్రైవర్: విడుదల 1.1.5-2437 కు నవీకరించబడింది.

  • megaraid_sas డ్రైవర్: విడుదల 3.10 కి నవీకరించబడింది.ఈ నవీకరణ IOCTL మెమొరీ పూల్ కలుపుటకు,bios_paramకొరకు ప్రారంభ సూచిని నిర్దారించుటకు మరియు చిన్నలోపాలను సరిదిద్దుటకు ఉంది.

  • Emulex lpfc డ్రైవర్:విడుదల 8.1.10.9 కు నవీకరించబడింది. ఈవిడుదల చాలా మార్పులను గమనించు విధంగా నవీకరించబడింది.

    • host_lock నిర్వహణioctl మార్గంలో సరిదిద్దబడింది.

    • AMD చిప్సెట్ ఇప్పుడు స్వయంచాలకంగా గుర్తింపబడుతుంది,మరియు DMA పొడవును 1024 bytes కి తగ్గించింది.

    • dev_loss_tmo డిస్కవరి చేతనంగా ఉన్నప్పుడు ఉపయుక్తలు తొలగింపబడవు.

    • 8GB లింక్ వేగాలు ఇప్పుడు సిద్దపరచబడినవి.

  • qla4xxx డ్రైవర్ క్రింది మార్పులు అమలు పరచటానికి నవీకరించబడింది:

    • IPV6, QLE406x మరియుioctl గుణకానికి మద్దతివ్వబడినది.

    • లుకప్ కి కారణమయ్యే mutex_lock లోపం సరిచేయబడింది.

    • ఏ అంతర్ముఖి ఎగుమతి/దిగుమతి కైనా ప్రయత్నిస్తున్నప్పుడు qla4xxx మరియు qla3xxx యొక్క లుకప్ విషయాలు పరిష్కరించబడ్డాయి.

  • mpt fusion డ్రైవర్సు:విడుదల 3.04.04 కి నవీకరించబడింది.ఈ నవీకరణ చాలా మార్పులను గమనించు విదంగా అమలుపరిచింది.

    • చాలా ఎర్రర్ హ్యాడ్లింగ్ లోపాలు సరైనవి.

    • mptsas ఇప్పుడు టార్గెట్ రీసెట్లను క్రమబద్దీకరించింది.

    • mptsas మరియు mptfc ఇప్పుడు LUNs మరియు టార్గెట్లను 255 కి పైగా మద్దతిస్తున్నాయి.

    • బహిర్గతంగా నిదానమైన DVD పనితనానికి కారణమో LSI mptspi డ్రైవర్ రిగ్రెషన్ సరిచేయబడింది.

    • LSI SCSI పరికరము BUSY స్థితిని ఇచ్చినప్పుడు,చాలప్రయత్నాలు జరిగిన తరువాత ఇక I/O ప్రయత్నం విఫలమవ్వదు.

    • స్వయంచాలక-పునర్నిర్మాణం తరువాత RAID ఎరేస్ ఇక ఎక్కువ సేపు అసిద్దంగా ఉండవు.

  • Areca RAID నియంత్రణలకు మద్దతివ్వడానికి arcmsr డ్రైవర్:చేర్చబడినది.

  • 3w-9xxx గుణకం: సరిగ్గా 3ware 9650SE కి మద్దతివ్వుటకు నవీకరించబడినది.

కెర్నల్ నోట్సు

  • CIFS కక్షిదారు విడుదల 1.48aRH కి నవీకరించబడింది.1.48a ప్యాచస్ తోకూడిన విడుదల పై ఇది ఆదారపడివుంది,క్రింది మార్పులను అమలు పరుస్తుంది:

    • మౌంట్ ఐచ్చికం sec=none ఏకగ్రీవ మౌంట్ గా వస్తుంది.

    • POSIX ఎక్సటెన్ష్సు సిద్దంగా ఉన్నప్పుడు umask ను CIFS ఒప్పుకుంటుంది.

    • ప్యాకె ట్ ప్రవేశాన్ని అర్దించే sec= మౌంట్ ఐచ్చికం సరిచేయబడింది.

    EMC Celerra ఉత్పత్తి (NAS Code 5.5.26.x and below) వినియోగదారులు,EMC NAS లోని షేర్సును ఉపయోగిస్తున్నప్పుడు CIFS కక్షిదారు స్థంబిస్థుందని గమనించాలి.ఈ క్రింది కెర్నల్ సందేశాల ద్వారా ఈ విషయం వ్యక్తీకరించబడుతుంది.

    kernel:  CIFS VFS: server not responding
    kernel:  CIFS VFS: No response for cmd 162 mid 380
    kernel:  CIFS VFS: RFC1001 size 135 bigger than SMB for Mid=384
    

    CIFS మౌంట్ తర్వాత, ఏ ఫైలునైనా దానిలో చదువుటకు/వ్రాయుటకు మరియు I/O మౌంట్ సూచీ వద్దఅనువర్తనంతో ప్రయత్నించిన అసాధ్యంగా పరిగమించి స్థంబించును.దీనిని సరిదిద్దుటకు NAS కోడ్ 5.5.27.5 లేదా తరువాతి(use EMC Primus case number emc165978) కి నవీకరించు.

  • MODULE_FIRMWARE టాగ్సు ఇప్పుడు మద్దతిస్తోంది.

  • ICH9 నియంత్రణలు ఇప్పుడు మద్దతిస్తోంది.

  • CPUID లో Greyhound ప్రోసెసర్సు మద్దతిస్తున్నవి.

  • Oprofile ఇప్పుడు క్రొత్త Greyhound పనితనపు కౌంటర్ కార్యాలకు మద్దతునిస్తోంది.

  • Directed DIAG ఇప్పుడు z/VM ఉపయోగాన్ని పెంపౌందించటానికి మద్దతిస్తోంది.

  • Intelగ్రాఫిక్సు చిప్సెట్ DRM కెర్నల్ గుణకం ద్వారా ఇప్పుడు పూర్తి మద్దతిస్తోంది.ఇంకా, DRM API సూటిరెండరింగు కు మద్దతివ్వటానికి విడుదల 1.3 కు నవీకరించబడింది.

  • ACPI కరెంటు నిర్వహణ నవీనీకరణ S3 suspend-to-RAM మరియు S4 హైబర్నేట్ ను అభివృద్దిచేసింది.

ఇత్రత్రా నోట్సు

  • gaim is now called pidgin.

  • Intel microcode ఇప్పుడు విడుదల 1.17 కి నవీకరించబడ్డాయి. ఇది క్రొత్త Intel ప్రోసెసర్సు కు మద్దతిస్తోంది.

  • ఇప్లిసిట్ చేతనా-చేతన ఫెయిల్ఓవర్ dm-multipathను EMC Clariion నిల్వలో ఉపయోగించుట మద్దతిస్తోంది.

  • చెనీస్ ఫాంట్ Zysong fonts-chinese ప్యాకేజ్ లో బాగంగా సంస్థాపించబడదు.Zysongఇప్పుడుfonts-chinese-zysong గా ప్యాకేజ్ చేయబడుతుంది.fonts-chinese-zysong ప్యాకేజ్ Supplementary CD లో ఉంచబడుతుంది.

    fonts-chinese-zysong ప్యాకేజ్ చెనీస్ జాతీయ ప్రమాణం GB18030 కు మద్దతివ్వవలిసి ఉంటుంది..

  • Challenge Handshake Authentication Protocol (CHAP) వినియోగదారునిపేరు మరియు పాస్ వార్డు ప్రతిఒక్క దానికి 256 అక్షర పరిమితిని కలిగిఉంది.

  • pump ఈ నవీనీకరణ లో డిప్రికేట్ చేయబడింది.అందుకని మీ వలయ అంతర్ముఖిని netconfig ద్వారా ఆకృతీకరించుట ifcfg కృతి విభజనకు కారణంకానచ్చు.

    మీ వలయ అంతర్ముఖిని సరిగా ఆకృతీకరించుటకు system-config-network ను వాడండి. నవీకరించిన system-config-network ప్యాకేజ్ సంస్థాపించిన netconfig ను తొలగించును.

  • rpm --aid మద్దతు నీయదు.మీరు ప్యాకేజ్ నవీకరించునపుడు మరియు సంస్థాపించునపుడు yum ను వాడుట మంచిది

సాంకేతిక పరిదృశ్యం

సాంకేతిక పరిదృశ్యం లక్షణాలు ప్రస్తుతం Red Hat Enterprise Linux 5.1 సబ్ స్క్రిప్షన్ సేవలకింద మద్దతివ్వటం లేదు, క్రియాశీలంగా పూర్తికాకపోవచ్చు, మరియూ సాధారణంగా ఉత్పత్తి వినియోగానికి ఉపయోగపడవు. ఏమైనప్పటికీ, ఈ లక్షణాలు వినియోగదారుని సౌలభ్యం కోసం చేర్చబడ్డాయి.

వినియోగదారుడు ఈ లక్షణాలను ఉత్పత్తి-రహిత వాతావరణానికి ఉపయోగించటానికి వాడవచ్చు. వినియోగదారుడు ఇది పూర్తిగా మద్దతివ్వటానికి ముందు ఫీడ్ బాక్ మరియూ సాంకేతిక పరిదృశ్యాల కోసం సూచనలను ఇవ్వవచ్చు.అధిక-సెవిరిటీ రక్షణ విషయాలకోసం Erratas సమకూర్చబడింది.

సాంకేతిక పరిదృశ్యాల అభివృద్ధిలో, అదనపు ఐచ్ఛికాలు ప్రజలకు పరిక్ష కోసం అందుబాటులో ఉంటాయి. ముందు వచ్చే చిన్న విడుదలలో సాంకేతిక పరిదృశ్యానికి పూర్తి మద్దతివ్వటం Red Hat యొక్క ఉద్దేశం.

స్థితిలేని Linux

ఈ విడుదలతో సహా ఇవి నిర్మణాత్మక ఉపకరణలు. స్థితిలేని లైనక్సు కంప్యూటరు ఎలా పనిచేస్తోంది మరియూ ఎలా నిర్వహించబడుతోందో తెలుసుకోవడానికి దీనిని ఆపరేటింగ్ సిస్టమ్ రీడ్-ఓన్లీ పద్దతి లో ఉపయోగించటం ద్వారా(నవీకరణ విషయాలకు /etc/sysconfig/readonly-root నుచూడండి) పూర్తి చేయవచ్చు.

దాని ప్రస్తుత అభివృద్ధి స్థితిలో, స్థితిలేని లక్షణాలు ఉద్దేశ్య లక్ష్యాలలో ఉపభాగాలుగా ఉంటాయి. సామర్ధ్యం సాంకేతక పరిదృశ్యంగా గుర్తించబడుతుంది.

ఈ కిందివి Red Hat Enterprise Linux 5లో ఉండే ప్రాధమిక సామర్ధ్యాల జాబితా:

  • NFSలో స్థితిలేని చిత్రం నడుస్తోంది

  • లూప్ బాక్ ద్వారా NFSలో స్థితిలేని చిత్రం నడుస్తోంది

  • iSCSIలో నడుస్తోంది

కింది దాంట్లోఉన్న స్థితిలేని కోడ్ చదవటానికి అధికంగా మద్దతివ్వబడుతుంది. http://fedoraproject.org/wiki/StatelessLinuxHOWTO మరియూ stateless-list@redhat.comలో చేరండి.

Stateless Linux కు నిర్మాణాత్మక భాగాలను సిద్దపరుచుట స్వచ్చంగా Red Hat Enterprise Linux 5 నందు పరిచయంచేయబడింది.

AIGLX

AIGLX పూర్తిగా మద్దతిస్తున్న X సర్వరు కంటే సాంకేతికంగా పూర్తి పరిదృశ్యం కలది. దీని లక్ష్యం GL-ప్రభావాలను ప్రామాణిక డెస్కుటాప్ మీద సాధ్యం చేయటం. ఈ ప్రాజెక్టు ఈ కింది వాటిని కలిగి ఉంది.

  • తక్కువగా మార్చబడ్డ X సర్వరు

  • కొత్త సమాచారం ప్యాకేజీ కొత్త చట్టం సమాచారాన్ని కలుపుతుంది

ఈ మూలకాలను సంస్థాపించటం ద్వారా, మీరు GL-ప్రభావాలను మీడెస్కుటాప్ యందు కొద్దిమార్పులతో కలిగి ఉంటారు, మీరు దాన్ని సాధ్యం చేయటమన్నది X సర్వరును సాధ్యంచేయటం లేదా చేయకపోవటం మీద ఉంటుంది. AIGLX కూడా దూరస్థ GLX అనువర్తనాలను GLX హార్డువేరు త్వరితత్వానికి సహకరిస్తాయి.

devicescape (d80211)

devicescape స్టాకు iwlwifi 4965GN వైర్లెస్ డ్రైవర్ ను సిద్దపరుస్తుంది.స్టాకు ఆయా వైర్లెస్ పరికరాలను ఏ Wi-Fi network కు అనుసంధానించుటకైనా అనుమతినిస్తుంది.

ఈ స్టాకు కోడ్ ఆధారితమైంది అది అప్ స్ట్రీమ్ చేత ఆమోదింపబడాలి.అదనంగా స్టాకు యొక్క స్థిరత్వం టెస్టింగ్ ద్వారా పరిశీలింపబడుతుంది. స్టాకు ఈ విడుదలలో సాంకేతిక పరిదృశ్యంగా కలుపబడింది.

FS-Cache

FS-Cache రిమోట్ ఫైల్ విధానం కోసం స్థానిక చేజింగ్ సౌకర్యం; ఇది వినియోగదారుల్ని NFS సమాచారాన్ని స్థానికంగా మరల్చబడిన డిస్కులో చేజ్ చేయటానికి అనుమతిస్తుంది. FS-చేజ్ సౌకర్యాన్ని అమర్చటానికి, cachefilesd RPMను సంస్థాపించండి మరియూ /usr/share/doc/cachefilesd-<version>/READMEని చూడండి.

సరిపోయినcachefilesd ప్యాకేజ్ సంస్థాపక ప్రతితో.విడుదల <version>.

కంప్యూటరుటాప్

Systemtap ఉచిత సాఫ్టువేరు (GPL) నిర్మాణాన్ని నడుస్తున్న Linux కంప్యూటరు యొక్క సమాచారాన్ని తేలిక చేయటానికి ఉపయోగిస్తుంది. అది దాని నేపధ్యం మరియూ క్రియాశీలతలో వచ్చే సమస్యలను నివారించటానికి ఉపయోగిస్తుంది. systemtap సహాయంతో, డెవలప్పర్లు టీడియస్ మరియూ మోసకారి సాధనం ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు, తిరిగి కూర్చటం, సంస్థాపన, మరియూ పునఃప్రారంభం సమాచారమ్ పొందటానికి కావలసి రావచ్చు.

iSCSI Target

Linux target (tgt) ఫ్రేమ్ వర్కు SCSI ప్రారంబిక గల వేరే సిస్టమ్సు లో బ్లాక్-లెవల్ SCSI నిల్వ సేవకు అనుమతిస్తుంది. ఈ సామర్ధ్యం ప్రప్రధమంగా Linux iSCSI టార్గెట్ గా ఉంచబడుతుంది,ఏ ప్రారంభికకైనా వలయంలో నిల్వను అందిచుటకు.

iSCSI టార్గెట్,కొరకుscsi-target-utils RPM సంస్థాపించి మరియు సూచనలను చూడండి:

  • /usr/share/doc/scsi-target-utils-<version>/README

  • /usr/share/doc/scsi-target-utils-<version>/README.iscsi

<version>సరిపోయిన ప్యాకేజి విడుదల తో దీనిని పునస్థాపించండి.replaceable >.

అధిక సమాచారానికి,man tgtadm చూడండి.

FireWire

firewire-sbp2 గుణకం సాంకేతిక పరిదృశ్యంగా ఈ నవీకరణలో చేర్చబడింది. ఈ గుణకాలు ఫైర్ వైర్ నిల్వ పరికరాలు మరియు గ్రాహికల అనుసంధానంతో సిద్దపరచబడింది.

ప్రస్తుతం,ఫైర్ వైర్ క్రింది వాటికి మద్దతునీయదు:

  • IPv4

  • pcilynx అతిధేయి నియంత్రికలు

  • బహుళ-LUN నిల్వ పరికరాలు

  • నిల్వ పరికరాల పై నాన్-ఎక్సుక్లూజివ్ అనుమతి

అదనంగా,క్రింది విషయాలు ఈ ఫైర్ వైర్ విడుదలలో ఇంకా ఉన్నాయి.

  • SBP2 డ్రైవర్ లో మెమొరీ లీక్ యంత్ర ప్రతిష్టంబనకు కారణం అవుతుంది.

  • ఈ విడుదలలోని కోడ్ big-endian యంత్రాలలో సరిగా పనిచేయడంలేదు.ఇది పవర్PC లో ఊహించని పరిణామానికి దారి తీయవచ్చు.

పరిష్కరించిన విషయాలు

  • SATA-ఎక్విప్డు సిస్టమ్సు లోబూట్ ప్రోసెస్ జరుగునప్పుడు స్థంబనకు ముందు తప్పును చూపించే లోపం ఇప్పుడు సరిదిద్దబడింది.

  • బహుళ బూట్ సిస్టమ్సు లోWindows Vista™ సంస్థాపించబడిన ప్రధమ విభజన యొక్క ప్రారంభ సెక్టార్ ను parted ఉంచుతుంది.బహుళ-బూట్ సిస్టమ్సు ని Red Hat Enterprise Linux 5.1 మరియు Windows Vista™ తో ఉంచితే,తరువాతది అన్ బూటబుల్ గా ఉండదు.

  • rmmod xennet domU క్రాష్ కావటానికి కారణంకాదు

  • 4-socket AMD Sun Blade X8400 సర్వరు గుణకం కంప్యూటరు మెమోరీ ఆకృతీకరణను node 0లో కలిగిలేదు బూటింగులో పానిక్ చేయబడుతుంది. కంప్యూటరు మెమోరీతో node 0లో కెర్నల్ పానిక్కుని నిరోధించటానికి ఆకృతీకరించబడవలసి ఉంటుంది.

  • conga మరియు luci ఇప్పుడు ఫెయిల్ ఓవర్ డొమైన్సు సృష్టించుటకు మరియు ఆకృతీకరించుటకు ఉపయోగపడుతుంది.

  • Cluster Storage సమూహాన్ని yum ద్వారా సంస్థాపించునపుడు,బదలీకరణ విఫలమవ్వదు.

  • సంస్థాపనయందు,సరికాని SELinux కాంటెస్ట్సు /var/log/faillog మరియు /var/log/tallylog కు జతపరచబడవు.

  • సంస్థాపన Red Hat Enterprise Linux 5.1 స్ప్లిట్ సంస్థాపన మాధ్యమాన్ని ఉపయోగించుతోంది (ఉదాహరణకు, CD లేదా NFచేస్తుంటేISO), amanda-సర్వరు సంస్థాపనలో ఒక దోషం సంభవించింది.

  • EDAC ఇప్పుడు క్రొత్త k8 ప్రోసెసర్సు లో సరైన మెమొరి మొత్తాన్ని ఇస్తోంది.

  • Gnome డెస్కుటాప్ లోకి దూరస్థ విధానంలో gdm ద్వరా ప్రవేశిస్తే ప్రవేశతెర స్థంభనకు కారణం కాదు.

  • బహుళ మరల్పులను అడ్డుకునే బగ్ autofs లో సరిచేయబడినది.

  • tvtime మరియూ xawtv ని bttv కెర్నలుతో నడపటం కంప్యూటరు ఫ్రీజవ్వటానికి కారణం కాదు.

  • utrace కు క్రింది సరికూర్పులు చాలా ప్యాచేస్ వలన కలుగుతున్నవి:

    • ptrace ఉపయోగించునపుడు రేస్ కండీషన్ క్రాష్ కు కారణం అయ్యే లోపం సరిదిద్దబడింది.

    • PTRACE_PEEKUSR కాల్సు నుండి వచ్చే రిగ్రషన్ అది ఎర్రొనియస్ EIO కి కారణమగు దానిని సరిచేయబడింది

    • కొన్ని సందర్బాలలో చైల్డు ప్రభావితం కాబడడంవల్ల వచ్చు wait4 కాల్సు ఆపే రిగ్రెషన్ సరిదిద్దబడింది

    • SIGKILL ను ప్రోసెస్ ముగింపు నుండి ఆపే రిగ్రెషన్ సరిచేయబడింది. ptrace కొన్ని సందర్బాలలో ప్రోసెస్ పైన అమలైనప్పుడు ఇది అవసరమౌతుంది.

  • RealTime Clock (RTC) లోపం ఏదైతే గడియారాన్ని మరియు RTC నిరోధాలను సరిగా పనిచేయనీయదో అది సరిదిద్దబడింది.

తెలిసిన విషయాలు

  • మొదటి సారి Release Notes ను నొక్కినప్పుడు Anaconda లో విండో విడుదల నోడ్సు ఇవ్వటానికి ఆలస్యమవుతుంది.ఈ ఆలస్యం ఖాళీ జాబితా కనబడుటకి కారణం.ఇది సాదారణంగా త్వరగా జరుగుతుంది, కనుక వినియోగదారులు దీన్ని గుర్తించరు.

    ప్యాకేజీ సంస్థాపనా తరుణం సంస్థాపన యొక్క CPU-ఇంటెన్సివ్ తరుణం అదే ఈ ఆలస్యమునకు కారణం.

  • NVIDIA గ్రాఫికల్ కార్డులను ఉపయోగిస్తున్న కంప్యూటర్లు చెడిపోయిన గ్రాఫిక్సుని లేదా ఫాంటుని గ్రాఫికల్ సంస్థాపనను ప్రదర్శిస్తున్నప్పుడు లేదా గ్రాఫికల్ ప్రవేశమప్పుడు ప్రదర్శించవచ్చు. దీనితో పనిచేయటానికి, వాస్తవిక కన్సోలుకి వెళ్లండి లేదా వాస్తవిక X ఆతిధేయికి తిరిగి వెళ్లండి.

  • ఆతిధేయ bus ఎడాప్టర్లు MegaRAID డ్రైవుకి ఉపయోగించేవి "Mass Storage" emulation రీతిలో ఉపయోగించటానికి తప్పక అమర్చాలి, "I2O" emulation రీతిలో కాదు. ఇది చేయటానికి, ఈ కింది విధానాన్ని చేయండి:

    1. MegaRAID BIOS అమర్పు వినియోగాన్నిఇవ్వండి.

    2. ఎడాప్టరు అమర్పు జాబితానిఇవ్వండి.

    3. ఇతర ఎడాప్టర్ ఐచ్ఛికాల కింద, ఎమ్యులేషన్ను ఎన్నుకోండి మరియూ మాస్ నిల్వలో ఉంచండి.

    ఒకవేళ ఎడాప్టరు "I2O" ఎమ్యులేషన్ క సరిగా అమర్చబడక పోతే, కంప్యూటరు i2o డ్రైవరును లోడుచేయటానికి ప్రయత్నిస్తుంది. ఇది విఫలమౌతుంది, లోడయ్యే డ్రైవర్లనుండీ నిరోధిస్తుంది.

    Red Hat Enterprise Linux ముందలి విడుదలలు సాధాణంగా I2O డ్రైవరును మెగాRAID డ్రైవరుకంటే ముందు లోడు చేయటానికి ప్రయత్నించవు. దీనికి సంబంధించి, లైనక్సును ఉపయోగించటానికి ముందు హార్డువేరు "Mass Storage" ఎమ్యులేషన్ రీతిలో అమర్చబడాలి.

  • Cisco Aironet MPI-350 వైర్లెస్ కార్డులున్న లాప్టాప్లు DHCP చిరునామాలను వైర్డు ఈధర్ నెట్ పోర్టు ఉపయోగించి చేసే నెట్వర్కు ఆధారిత సంస్థాపనలో హాంగవ్వొచ్చు.

    దీనితో పనిచేసేటప్పుడు, మీ సంస్థాపనకు స్థానిక మాధ్యమాన్ని ఉపయోగించండి. ప్రత్యామ్నాయంగా, మీరు లాప్ టాప్ BIOS priorలో సంస్థాపనకు వైర్లెస్ కార్డును సాధ్యం చేయవచ్చు (సంస్థాపన పూర్తయ్యినతరువాత మీరు తిరిగి కార్డును సాధ్యం చేయగలుగుతారు).

  • ప్రస్తుతం, system-config-kickstart ప్యాకేజీలను ఎన్నికచేయటం మరియూ చేయకపోవటానికి మద్దతివ్వదు. system-config-kickstartను ఉపయోగించేటప్పుడు, ఈ ప్యాకేజీ ఎన్నిక ఐచ్ఛికం అది అసాధ్యమని సూచిస్తుంది. ఇది system-config-kickstart yumను సమూహ సమాచారాన్ని కూర్చటానికి ఉపయోగించటంవల్ల, కానీ yum Red Hat Networkకి అనుసంధించటానికి ఆకృతీకరించటానికి కుదరదు.

    మీమీ కిక్ స్ట్రార్టు ఫైలులో మానవీయంగా ప్యాకేజీ ఫైళ్లను నవీకరించవలసి ఉంది. system-config-kickstartను కిక్ స్టార్టు ఫైలును తెరవటానికి ఉపయోగిస్తున్నప్పుడు, మీరు అన్ని ప్యాకేజీల సమాచారాన్నీ తీసుకోవలసి ఉంటుంది వాటిని భద్రపరిచేటప్పుడు వెనక్కి ఇవ్వవలసి ఉంటుంది.

  • /var/log/boot.logకి Boot-time ప్రవేశం ఈ Red Hat Enterprise Linux 5 విడుదలలో అందుబాటులో లేదు. ముందలి నవీకరణలలో సమానమైన క్రియాశీలత సమకూర్చబడుతుంది.

  • Red Hat Enterprise Linux 4 to Red Hat Enterprise Linux 5 నుండీ నవీకరిస్తున్నప్పుడు, డిప్లోయ్ మెంట్ నివేదిక మానవీయంగా సంస్థాపించబడదు. మీరు pirutను నవీకరణ పూర్తయ్యినతరువాత దాన్ని మానవీయంగా సంస్థాపించవలసి ఉంటుంది.

  • ఈ కంప్యూటరు kexec/kdump కెర్నలులోకి విజయవంతంగా పునఃప్రారంభించబడదు X కనుక వేసా కంటే వేరైనదాన్ని ఉపయోగిస్తున్నా లేదా నడుస్తున్నా. ఈ సమస్య ATI Rage XL గ్రాఫికల్ చిప్ సెట్టుతో కూడిఉంది.

    X ATI Rage XLతో కంప్యూటరు ఎక్యూప్డుతో నడుస్తుంటే, అది వేసా డ్రైవరును kexec/kdump కెర్నలులోకి విజయవంతంగా రీబూటు చేయటానికి ఉపయోగిస్తుంది.

  • వాస్తవీకరణ లక్షణాన్ని సంస్థాపించటం HP కంప్యూటర్లలో మాదిరిసంఖ్య xw9300 మరియూ xw9400time went backwards హెచ్చరిక.

    xw9400 కంప్యూటర్లకోసం ఈ విషయంతో పనిచేయటానికి, BIOS అమర్పులను HPET టైమరును సాధ్యం చేయటానికి ఆకృతీకరించండి. ఈ ఐచ్ఛికం xw9300 కంప్యూటర్లలో అందుబాటులో ఉండదని గమనించండి.

    HP ద్వారా రాబోతున్న BIOS నవీకరణ దీన్ని సరిదిద్దుతుంది.

  • మీ కంప్యూటర్లలో Red Hat Enterprise Linux 5ను nVidia CK804 చిప్ సెట్టుసంస్థాపనతో వినియోగిస్తున్నప్పుడు, కింది దానితో సమానమైన కెర్నల్ సమాచారాన్ని పొందవచ్చు.

    kernel: assign_interrupt_mode Found MSI capability
    kernel: pcie_portdrv_probe->Dev[005d:10de] has invalid IRQ. Check vendor BIOS
    

    ఈ సమాచారాలు PCI-E పోర్ట్సు IRQలను అడగవు. ఇతరత్రా, ఈ సమాచారాలు, ఏమైనప్పటికీ, కంప్యూటరు క్రియాశీలతను దెబ్బతీయవు.

  • మూలంగా ప్రవేశించినప్పుడు తీసివేయు నిల్వ పరికరాలు(CDs మరియుDVDs) స్వయంచాలకంగా మౌంట్ అవ్వవు.అప్పుడు గ్రాఫికల్ ఫైల్ మేనేజర్ ద్వారా మానవీయంగా పరికరాన్ని మౌంట్ చేయవలె.

    ప్రత్యామ్నయంగా మీరు ఈ క్రింది ఆదేశాన్ని పరికరం మౌంట్ అవ్వటానికి వాడవచ్చు /media:

    mount /dev/<device name> /media
    
  • Calgary IOMMU చిప్ ఈ నవీకరణ లో సిద్దంగా మద్దతునీయడం లేదు. ఈ మద్దతు సిద్దపరుచుటకు కెర్నల్ iommu=calgary కమాండ్ లైన్ ఐచ్చికం వాడండి.

  • IBM System z సాంప్రదాయక Unix-శైలి యొక్క భౌతిక కన్సోలుని సమకూర్చలేదు. అలాగే, Red Hat Enterprise Linux 5 IBM System z కోసంసంస్థాపన పరిక్రమం లోడయ్యేటప్పుడు firstboot క్రియాశీలతకు మద్దతివ్వలేదు.

    IBM System zలో సరైన Red Hat Enterprise Linux 5 సంస్థాపక అమర్పుకు, ఈ కింది ఆదేశాలను సంస్థాపన తరువాత ఉపయోగించండి:

    • /usr/bin/setup — provided by the setuptool package.

    • /usr/bin/rhn_registerrhn-setupప్యాకేజీతో సమకూర్చబడింది

  • Red Hat Enterprise Linux 5 to Red Hat Enterprise Linux 5.1 ను Red Hat Network ద్వారా నవీకరిస్తున్నప్పుడు,yum మిమ్ముల్ని redhat-beta key దిగుమతి చేయమని అడగదు.నవీకరణకు ముందే మీరు మానవీయంగా redhat-beta key దిగుమతిచేయుట మంచిది. ఇది చేయుటకు క్రింది ఆదేశాన్ని నడపండి.గదు.

    rpm --import /etc/pki/rpm-gpg/RPM-GPG-KEY-redhat-beta

  • LUN ఆకృతీకరించబడిన దస్త్రం లో గుర్తించబడినప్పుడు అతిధేయి లో మార్పు ప్రతిబింబిచదు.అటువంటప్పుడు lvm ఆదేశాలు dm-multipath వినియోగంలో ఉన్నప్పుడు స్థంబించబడతాయి,LUN ఇప్పుడు stale అవుతుంది.

    దీనికోసం,అన్ని పరికరాల మరియు mpath లింకు ప్రవేశాలు/etc/lvm/.cache లో ప్రత్యేకంగా స్టేట్ LUN తోలగించాలి.

    ఈ ప్రవేశాలు ఏమిటో కనిపెట్టటానికి క్రింది ఆదేశాన్ని ఉపయోగించు:

    ls -l /dev/mpath | grep <stale LUN>

    ఉదాహరణకు <stale LUN> is 3600d0230003414f30000203a7bc41a00,అయితే క్రింది ఫలితాలు రావచ్చు:

    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00 -> ../dm-4
    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00p1 -> ../dm-5
    

    దీని అర్ధం 3600d0230003414f30000203a7bc41a00 ఇప్పుడు mpath links: dm-4 మరియు dm-5 రెంటికి మేప్ చేయబడుతుంది.

    ఈ క్రింది పంక్తులుు /etc/lvm/.cache: నుండి తొలగించాలి:

    /dev/dm-4 
    /dev/dm-5 
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00p1
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00p1
    
  • పూర్తిగా వాస్తవీకరించబడ్డ విండోస్™ను CD / DVD నుండీ ,సృష్టించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆతిధేయ సంస్థాపన యొక్క రెండోదశ పునఃప్రారంభంలో కొనసాగించలేదు.

    దీనితో పనిచేయటానికి, /etc/xen/<name of guest machine> CD / DVD సాధనానికి సరైన ప్రవేశంగా కూర్చటం ద్వారా ఏర్పరచండి.

    సాధారణ ఫైలుకి సంస్థాపన వాస్తవిక సాధనాన్ని ఉపయోగిస్తుంటే, ఈ డిస్కు పంక్తి యొక్క /etc/xen/<name of guest machine> కింది విధంగా చదువుతుంది:

    disk = [ 'file:/PATH-OF-SIMPLE-FILE,hda,w']
    

    ఆతిధేయిలో /dev/dvdగా ఉంచబడ్డ DVD-ROM సాధనం 2 దశ సంస్థాపనలో అందుబాటులో ఉండవచ్చు hdcలో 'phy:/dev/dvd,hdc:cdrom,r'గా ఉండవచ్చు. అలాంటప్పుడు, డిస్కు ఈ కింది విధంగా చదవబడుతుంది:

    disk = [ 'file:/opt/win2003-sp1-20061107,hda,w', 'phy:/dev/dvd,hdc:cdrom,r']
    

    సాధనం యొక్క మార్గం మీ హార్డువేరు మీద ఆధారపడి ఉంటుంది.

  • sctp గుణకాన్ని కెర్నల్ కు కలుపక పోతే,netstat ను-A inet లేద -A inet6తో నడుపుట అసాధారణ ముగింపు క్రింది సందేశం తో సంభవిస్తుంది

    netstat: no support for `AF INET (sctp)' on this system.        
    

    దీనిని తొలగించుటకుsctp కెర్నల్ మాడ్యూల్ ను సంస్థాపించు:

  • Red Hat Enterprise Linux 3.9 ను పూర్తిగా వాస్తవీకరించిన అతిధేయాలలో సంస్థాపించుటవలన నిదానింపబడవచ్చు.అధనంగా, అతిధేయను సంస్థాపన తరువాత బూట్ చేయునప్పుడుhda: lost interrupt తప్పులకు కారణం కావచ్చు.

    ఈ బూటప్ తప్పును తప్పించటానికి,SMP కెర్నల్ ఆకృతీకరించండి.

  • బూట్ సమయమందు ప్రస్తుత కెర్నల్ Data Terminal Ready(DTR) సూచనలను ముద్రణకు ముందల సీరియల్ పోర్టులకు ఇవ్వడంలేదు.DTR ఎస్సర్షన్సు కోన్ని పరికరాలకు అవసరం,ఫలితంగా ఆ పరికరాలలో కెర్నల్ బూట్ సందేశాలు వరుస కన్సోల్సు పై ముద్రించబడవు.

  • అతిధేయి (dom0)సిస్టమ్ ను Red Hat Enterprise Linux 5.1 కు నవీకరించడం వలన Red Hat Enterprise Linux 4.5 SMP పారావర్త్యులైజ్డు అతిధైయాలు బూట్ అవ్వకపోవచ్చు.అతిధేయి సిస్టమ్ 4GB RAM కన్నా ఎక్కువైనప్పుడు ఇది జరుగవచ్చు.

    ఈ పనిచేయుటకు,ప్రతి Red Hat Enterprise Linux 4.5 అతిధేయిను సింగిల్ CPU రీతికి మరియు కెర్నల్ ను క్రొత్త విడుదల (for Red Hat Enterprise Linux 4.5.z) కు నవీకరించండి.

  • AMD 8132 మరియు HP BroadCom HT100ను MMCONFIGసైకిల్సు ను మద్దతివ్వని ఫ్లాట్ఫాం(such as the HP dc7700) పై ఉపయోగిస్తారు.మీ సిస్టమ్ ఈ చిప్సెట్ ను వాడుతుంటే,మీ PCI ఆకృతీకరణ లెగసీPortIO CF8/CFC మిషన్సు ను వాడాలి.దీనిని ఆకృతీకరించుటకు సిస్టమ్ ను సంస్థాపనప్పుడు కెర్నల్ పారామతో బూట్ చేసి మరియు బూటింగ్ తరువాత pci=nommconfను GRUBకు కలుపు.

    ఇంకా AMD 8132 చిప్సెట్ Message Signaled Interrupts (MSI) కు మద్దతివ్వదు. మీ సిస్టమ్ ఈ చిప్సెట్ వాడుతుంటే మీరు MSI ని అచేతనం చేయాలి.ఇది చేయుటకు సంస్థాపనయందు కెర్నల్ పారామితిని -pci nomsiఉపయోగించి మరియు pci=nomsi ను బూట్ తర్వాత GRUB కి కలుపండి.

    మీ సిస్టమ్ ఇప్పటికే కెర్నల్ యొక్క బ్లాక్ లిస్టులో ఉంటే,మీ సిస్టమ్ కు ముందుగా చెప్పబడిన pci కెర్నల్ పారామితులు అవసరంలేదు.ఈ క్రింది HP ఫ్లాట్ఫాం లు కెర్నల్ చేత బ్లాక్ లిస్టు చేయబడినవి:

    • DL585g2

    • dc7500

    • xw9300

    • xw9400

  • ఈ విడుదల లోనిVirtual Machine Manager (virt-manager)వినియోగదారులను పారావర్చ్యులైజ్డు అతిధేయ సంస్థాపనకు అదనపు ఆర్గుమెంట్లను ఇవ్వనివ్వదు.ప్రత్యేకమైనన హార్డువేర్ లలో కోన్ని రకాల పారావర్చ్యులైజ్డు అతిధేయాల సంస్తాపనకు కూడ అటువంటి ఆర్గుమెంట్ లను ఇవ్వదు.

    ఆ విషయం virt-managerయొక్క భవిష్య విడుదలలో చెప్పబడుతుంది. ఆర్బిటరి కెర్నల్ ఆర్గుమెంట్లను కమాండ్ లైన్ ద్వారా పారావర్చ్యులైజ్డు అతిధేయ సంస్థాపనకు virt-install ద్వారా తెలుపవచ్చు.

  • dm-multipath ఆకృతీకరణలో Netapp పరికరాలు గతంలో విఫలమైన మార్గాన్ని రీస్టోర్ చేసిన తరువాత ఫెయిల్ బాక్ పూర్తిచేయుటకు చాలా నిమషాలు పట్టవచ్చు. దీనిని సరిదిద్దుటకుmultipath.conf విభాగంలోని పరికరాలుకు క్రింది Netapp పరికర ఆకృతిని కలపండి.

    devices {
            device {
                    vendor                  "NETAPP"
                    product                 "LUN"
                    getuid_callout          "/sbin/scsi_id -g -u -s /block/%n"
                    prio_callout            "/sbin/mpath_prio_netapp /dev/%n"
                    features                "1 queue_if_no_path"
                    hardware_handler        "0"
                    path_grouping_policy    group_by_prio
                    failback                immediate
                    rr_weight               uniform
                    rr_min_io               128
                    path_checker            directio
            }
    

( amd64 )



[1] ఈ సామగ్రి http://www.opencontent.org/openpub/లో అందుబాటులో ఉన్న ఓపెన్ పబ్లికేషన్స్ లైసెన్సు, v1.0, లోని విషయప్రధాన నిబంధనలను పంపిణీ చేయవచ్చు.

mirror server hosted at Truenetwork, Russian Federation.